షాకింగ్‌ న్యూస్.. రాజ్‌కుంద్రా‌తో శిల్పాశెట్టి విడాకులు..?

by Anukaran |
raj kundra news
X

దిశ, సినిమా: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాలు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో డీప్ డిస్కషన్ నడుస్తోంది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా జైలులో ఉన్నప్పుడే శిల్ప క్లోజ్ ఫ్రెండ్స్‌ ఈ విషయంపై చర్చించారు. తండ్రి చేసిన పనికి పిల్లలు బలికాకూడదని, రాజ్ నుంచి, ఇంటి నుంచి దూరంగా వెళ్లేందుకు తను డిసైడ్ అయిందని తెలిపారు. ఇండిపెండెంట్ ఉమన్ అయిన శిల్ప.. రాజ్ జైలు నుంచి తిరిగొచ్చేలోపు వెళ్లిపోతుందన్నారు. కానీ, అదేమీ జరగలేదు. పైగా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరూ కలిసిమెలిసి ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ కొత్తగా ఈ విషయం తెరమీదపైకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విడాకులు తీసుకుంటున్నారా? లేదా? అనేది పక్కన పెడితే.. రాజ్ – శిల్ప ఒకరికొకరు చాలా ఏళ్లుగా తెలుసు. పైగా పెళ్లికి ముందు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అందుకే ఈ ఇద్దరి మధ్య ఈ బంధం ఇంకా పదిలంగా ఉందని అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed