- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నిటినీ తట్టుకున్న ఆ మహిళ.. ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని ప్రాణాలు చాలా గట్టిగా ఉంటాయని అంటుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఎదురైనా భూమ్మీద నూకలు ఉన్నవాళ్లను ఎవరూ ఏం చేయలేరనేది అక్షర సత్యమని ఈ నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన జాయ్ ఆండ్రూ అనే మహిళను చూస్తే అనిపిస్తోంది. నాజీ అసాసినేషన్, విమాన ప్రమాదం, బ్రెస్ట్ కేన్సర్, ఇటీవల కొవిడ్ బారిన కూడా పడి ఆమె విజయవంతంగా బతికి బట్టకట్టి, నవంబర్ 22న తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె ఇన్ని గండాలు గట్టెక్కి జీవించి ఉండటం నిజంగా ఒక గొప్పవిషయం అని ఆమెతోపాటు యార్క్ కేర్ హోమ్‌లో ఉంటున్న వాళ్లు అంటున్నారు.
కొవిడ్ నిబంధనల కారణంగా ఆమె కూతురు మిషెల్ ఆండ్రూ, 100వ పుట్టినరోజు వేడుకకు హాజరు కాలేకపోయింది. మూడెంకెల వయస్సు పడిన ప్రతి ఒక్కరికి యూకే రాణి నుంచి ఒక గ్రీటింగ్ అందుకోవడం ఒక సంప్రదాయం. జాయ్‌కి కూడా తన 100వ పుట్టిన రోజుకు రాణి నుంచి వ్యక్తిగత సందేశంతోపాటు, గ్రీటింగ్ కార్డు కూడా లభించింది. 1920లో ఉత్తర లండన్‌లో జన్మించిన జాయ్, మహిళల ఆక్జిలరీ ఎయిర్ ఫోర్స్‌లో సార్జెంట్‌గా పనిచేసింది. 1936 నుంచి 1968 మధ్యలో ఆమె పనిచేస్తున్న బాంబర్ కమాండ్ ఎన్నో దాడులను ఎదుర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జాయ్, బ్రిటిష్ ఆర్మీలో చేరింది. అక్కడ ఆమె మీద నాజీలు దాడి చేసినట్లు కూతురు మిషెల్ తెలిపింది. తర్వాత 1970ల్లో జాయ్ బ్రెస్ట్ కేన్సర్‌ను జయించింది. తర్వాత మే 16న కొవిడ్ పాజిటివ్ వచ్చినపుడు అందరూ జాయ్ బతుకుతుందనే ఆశ కోల్పోయినప్పటికీ, ఆమె విజయవంతంగా జయించగలిగిందని మిషెల్ వెల్లడించింది.