ఓటర్ లిస్ట్‌లో చిన్నమ్మ పేరు గల్లంతు!

by Shamantha N |
Shashikala
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో జయలలిత నెచ్చెలి శశికళకు పోలింగ్ కు ఒకరోజు ముందు షాక్ తగిలింది. ఓటర్ లిస్ట్‌లో ఆమె పేరు లేకపోవడం గమనార్హం. ఓటింగ్‌కు ఒకరోజు ముందు ఆమె ఓటు గల్లంతయింది. ఓటర్ స్లిప్‌ల పంపిణీలో భాగంగా లిస్ట్‌ను పరిశీలించగా.. జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో ఖంగుతిన్న ఆమె ఎన్నికల సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. అయితే ఆమె ఓటును కావాలని ఎవరన్న తీసేశారా? లేక సాంకేతిక సమస్యలతో తొలగిపోయిందా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, తను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శశికళ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story