అభిమానుల విషయంలో షారుఖ్ ఇన్‌సెక్యూర్..

by Shyam |   ( Updated:2021-09-11 06:44:13.0  )
అభిమానుల విషయంలో షారుఖ్ ఇన్‌సెక్యూర్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వీడియో వైరల్ అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ అయిన వీడియో SRK సెన్స్ఆఫ్ హ్యూమర్‌తో నిండిపోయింది. వీడియోలో షారుఖ్, రాజేష్ కనిపించగా.. తనకు చాలా మంది అభిమానులున్నారని, ఇంతమంది ఫ్యాన్స్ ఓ హీరో ఇంటిముందు ఎప్పుడైనా గ్యాదర్ కావడం చూశావా? అని షారుఖ్ రాజేష్‌ను ప్రశ్నిస్తాడు. దానికి రాజేష్ ఇప్పటి వరకు చూడలేదు కానీ భవిష్యత్తులో చూడొచ్చేమో అని సమాధానమిస్తాడు.

అంటే ఏంటి? అని షారుఖ్ అడగ్గా.. ఇతర స్టార్స్ సినిమాలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వస్తున్నాయి కదా అని చెప్తాడు రాజేష్. నిజమా? ఎవరు వారు? అని షారుక్ ప్రశ్నిస్తే.. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి వారు అందరూ ఉన్నారు అని రాజేష్ సమాధానమిచ్చాడు. మరి ఎవరు లేరంటే.. మీరే లేరని చెబుతాడు రాజేష్. దీంతో హాట్‌స్టార్‌లో షారుఖ్ తప్ప బిగ్ స్టార్స్ అందరూ ఉన్నారన్న వాయిస్ ఓవర్‌తో ఎండ్ అవుతుంది క్లిపింగ్. కాగా షారుక్ తదుపరి చిత్రం కూడా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ కానుండటంతో ఈ యాడ్‌కు ఒప్పుకున్నాడని కొందరు నిపుణులు చెబుతుండగా.. ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story