మీ స్పందన కావాలి.. కామెంట్లు పెట్టండి: షర్మిల

by srinivas |   ( Updated:2020-07-19 08:33:31.0  )
మీ స్పందన కావాలి.. కామెంట్లు పెట్టండి: షర్మిల
X

దిశ ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి జీవిత ఘట్టాలతో ఆయన భార్య విజయమ్మ ఇటీవల రాసిన ‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుస్తకంపై అభిమానులు, ఇతరులు ఏమనుకుంటున్నారన్న స్పందనను ఆ దంపతుల కుమార్తె శర్మిల తెలుసుకోవాలనుకుంటున్నారు. దీంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా “అమ్మ రాసిన పుస్తకం ‘నాలో.. నాతో… వైఎస్సార్’ పట్ల మీ అందరి అపూర్వ స్పందన మాకు దక్కిన విశిష్ట గౌరవంగా భావిస్తున్నాం. ఆ పుస్తకంపై మీ స్పందనలను కామెంట్ల రూపంలో పంపించండి. మీ సందేశాలన్నింటినీ చదవాలనుకుంటున్నాను” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

Next Story