- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు సేకరించిన షేర్‌చాట్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ కంటెంట్ షేరింగ్ యాప్ షేర్‌చాట్ భారీగా పెట్టుబడులను సేకరించింది. సింగపూర్‌కు చెందిన మూరే స్ట్రాటజిక్, టెమాసెక్ వెంచర్స్‌తో పాటు మరో సంస్థ నుంచి రూ. 1,080 కోట్ల నిధులను సేకరించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిధుల సమీకరణ ద్వారా షేర్‌చాట్ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ. 23 వేల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ట్విటర్, టైగర్ గ్లోబల్ స్నాప్ సహా ఇతర కంపెనీల నుంచి సుమారు రూ. 3,800 కోట్ల నిధులను అందుకుంది. షేర్‌చాట్ యాప్‌లో ఉపయోగించే ఏఐ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి ఈ కొత్త నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనివల్ల తమ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ఫ్రెండ్లీ ఎడిటింగ్ టూల్స్‌ను అందించడానికి వీలవుతుందని కంపెనీ వివరించింది. కాగా, ప్రముఖ వీడియో కంటెంట్ యాప్ టిక్‌టాక్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత షేర్‌చాట్ కు దేశీయంగా గణనీయమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం షేర్‌చాట్ కు 18 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు తెలుస్తోంది.