శరత్ కుమార్ పేరుతో మోసం..

by Jakkula Samataha |
శరత్ కుమార్ పేరుతో మోసం..
X

సినీ ప్రముఖులంటే జనాల్లో భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్లు ఏదైనా పని మీద మన ప్రాంతానికొస్తే దగ్గరి నుంచి చూసేందుకు ఎగబడిపోతుంటాం. అదే వ్యక్తి పేరు చెప్పి చాన్స్ ఇప్పిస్తామంటూ ఎవరైనా వస్తే ముందూ వెనక ఆలోచించకుండా గుడ్డిగా ఓకే చెప్పేస్తాము. డబ్బులు అడిగినా మారు మాట్లాడకుండా ముట్టజెప్పేస్తాము. ఈ మధ్య ఇలాంటివి చాలానే జరిగాయి. హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ అజయ్ భూపతి, గీతా ఆర్ట్స్ బ్యానర్, సింగర్ సునీత పేరు చెప్పి పలువురు మోసగాళ్లు అమాయకుల నుంచి బాగానే డబ్బులు గుంజారు.

తాజాగా సీనియర్ హీరో శరత్ కుమార్ పేరు చెప్పి ఇలాంటి పనే చేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ‘శరత్ కుమార్ అఖిల భారత సమత్తుల కట్చి’ పేరుతో ఓ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అవి శరత్ కుమార్ సమక్షంలో జరుగుతాయని చెప్పి డబ్బులు లాగడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన శరత్ కుమార్ ఆ వ్యక్తిని మందలించడంతో పాటు చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరాడు.

Advertisement

Next Story