- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్లీతో షారుక్ మూవీ అప్పుడేనా?
యంగ్ డైరెక్టర్ అట్లీ ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిజిల్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. తొలి సినిమా రాజా రాణితో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అందించిన అట్లీ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసిన మూడు సినిమాలు తళపతి విజయ్‌తోనే చేశాడు. కేవలం నాలుగంటే నాలుగు సినిమాలతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అట్లీ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూపర్ స్టార్ షారుక్‌ఖాన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
డైరెక్టర్ అట్లీ ఫుల్ స్ట్రిప్ట్‌తో షారుక్‌ను కలవకపోయినా అట్లీ చెప్పిన ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ షారుక్‌ను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. అందుకే అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేలోపు షారుక్ ఒకటి, రెండు సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. ఆ తర్వాతే అట్లీ డైరెక్షన్‌లో మూవీ స్టార్ట్ అవుతుందట. అంటే 2021లోనే సినిమా ప్రక్రియ పట్టాలెక్కనుంది. ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్ సినిమా నిర్మించనున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీగా రాబోయే ఈ సినిమా బాహుబలి, రోబో 2.0 మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయబోతోందట.