- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధిక లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. అంతకుముందు సెషన్లో అత్యధిక నష్టాలను ఎదుర్కొన్న సూచీలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. ప్రధానంగా దేశీయంగా ఆటో, ఐటీ, రియల్టీ రంగాల్లోని షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపించారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలు, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా కొనుగోళ్లకు సిద్ధపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 488.10 పాయింట్లు ఎగసి 59,677 వద్ద క్లోజయింది. నిఫ్టీ 144.35 పాయింట్లు లాభపడి 17,790 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా రియల్టీ రంగం భారీగా 6 శాతం బలపడింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాలు సైతం అధిక పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్ సంస్థ షేర్లు భారీగా 10 శాతానికి పైగా దూసుకెళ్లింది. ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు అధిక లాభాలను సాధించాయి. డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, బజాజ్ ఫిస్‌సర్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఏమ్రికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75 వద్ద ఉంది.