- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆరో రోజూ లాభాలను సాధించిన మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత నిలకడగా రాణించిన సూచీలు మిడ్‌సెషన్ సమయంలో ఆటుపోట్లకు గురైనప్పటికీ వరుసగా ఆరో సెషన్‌లో లాభాలను దక్కించుకున్నాయి. బుధవారం నాటి లాభాలతో బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తంగా 15 సార్లు సరికొత్త జీవన కాల గరిష్ఠాలను సాధించాయి. విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఎఫ్ఐఐల ప్రవాహం కొనసాగుతుండటంతో మార్కెట్లు గరిష్ఠ స్థాయిని కొనసాగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 133.14 పాయింట్లు లాభపడి 47,746 వద్ద ముగియగా, నిఫ్టీ 49.35 పాయింట్ల లాభంతో 13,981 వద్ద ముగిసింది.
నిఫ్టీలో మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీలు బలపడగా, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను సాధించగా, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.18 వద్ద ఉంది.