- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల గరిష్ఠానికి మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) శుక్రవారం ఆరు నెలల గరిష్ఠంతో ముగిశాయి. ముఖ్యంగా మీడియా, బ్యాంకింగ్ (Media, Banking) రంగం షేర్లు అత్యధిక లాభాలను అందించాయి. ఉదయం ప్రారంభమైన సమయంలోనూ 200 పాయింట్లకు పైగా లాభాలతో మొదలైన సూచీలు (Indicators) చివరి వరకూ అదే జోరును కొనసాగించాయి. ఇన్వెస్టర్లు (Investors) ఎక్కువగా కొనుగోళ్లకు మద్దతు ఇవ్వడంతో మార్కెట్లు రోజంతా సానుకూలంగా ట్రేడయ్యాయి.
అమెరికా మార్కెట్లు వరుస ఐదోరోజు గరిష్ఠానికి చేరడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై సెంటిమెంట్ బలపడేలా చేసిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో, మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex)353.84 పాయింట్లు లాభపడి 39,467 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty)96 పాయింట్ల లాభంతో 11,655 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల (Private, public sector banks) షేర్లు 5 శాతం వరకు పుంజుకున్నాయి. అలాగే, మీడియా రంగం దాదాపు 2 శాతం బలపడింది. మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎల్అండ్‌టీ షేర్లు అత్యధిక లాభాల్లో కొనసాగగా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, ఎషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.38 వద్ద ఉంది.