స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!

by Harish |   ( Updated:2020-08-25 06:45:59.0  )
స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రారంభంలో ఉన్న జోరు అనంతర పరిణామాలతో క్షీణించిన కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ప్రారంభం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో మార్కెట్లు భారీ లాభాల దిశగా పయనించగా, మిడ్ సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో తొలుత లాభాలను ఆర్జించిన మార్కెట్లు చివరికి స్వల్పానికి దిగజారాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 44.80 పాయింట్ల లాభంతో 38,843 వద్ద ముగియగా, నిఫ్టీ 5.80 స్వల్ప పాయింట్లను నమోదు చేసి 11,472 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్, మీడియా, ఆటో రంగాలు పుంజుకోగా, మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు అధిక లాభాలతో ట్రేడవ్వగా, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, టాటాస్టీల్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.32 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed