- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాలను నమోదు చేసిన సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Domestic equity markets) మళ్లీ లాభాలను నమోదు చేశాయి. వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ వారాంతం తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గడం, గృహాల విక్రయాలు పెరగడంతో అక్కడి మార్కెట్లు సానుకూలంగా ర్యాలీ చేశాయి. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్(Sensex) 127.01 పాయింట్లు ఎగసి 40,685 వద్ద ముగియగా, నిఫ్టీ(Nifty) 33.90 పాయింట్లు లాభపడి 11,930 వద్ద ముగిసింది.
నిఫ్టీ(Nifty)లో అత్యధికంగా ఆటో రంగం 3 శాతం పుంజుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఐటీ, మీడియా రంగాలు స్వల్పంగా పుంజుకోగా, ఫార్మా, రియల్టీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్(Sensex Index)లో మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్, హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.63 వద్ద ఉంది.