- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డుల ర్యాలీ సృష్టిస్తున్న సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డులను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారిగా 46 వేల మార్కును దాటేసింది. నిఫ్టీ కూడా 13,500 మార్కును దాటింది. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంకేతాలు, ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకుంటూ ఉండటం మార్కెట్లకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సానుకూల పరిణామాలతో మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో సూచీలు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 494.99 పాయింట్లు ఎగసి 46,103 వద్ద ర్యాలీ చేయగా, నిఫ్టీ 136.15 పాయింట్లు లాభపడి 13,529 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ రంగాలు పుంజుకోగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.57 వద్ద ఉంది.
6 నెలల్లో 50 వేల మార్కు
ఇప్పటికే వరుసగా ఆల్‌టైం గరిష్ఠ స్థాయిలో ర్యాలీ అవుతున్న సూచీలు కొంత దిద్దుబాటు చర్యలను చేపడితే మరికొద్దిరోజుల్లో 47 వేల మార్కును చేరుకుంటుందని, రాబోయే 6 నెలల్లో 50 వేల మైలురాయిని చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.