చైనీయులకు చుక్కలు చూపించిన భవనం.. ఒక్క ఊపుతో

by Anukaran |   ( Updated:2021-05-19 00:59:51.0  )
చైనీయులకు చుక్కలు చూపించిన భవనం.. ఒక్క ఊపుతో
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా దేశంలో ఎన్నో అద్భుతమైన భవనాల్లో సెగ్ ప్లాజా భవనం కూడా ఒకటి. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో సెగ్ ప్లాజా కూడా ఒకటి..ఏకంగా 72 అంతస్తులతో.. 356 అడుగుల ఎత్తులో.. చైనాలోని అత్యంత ఎత్తైన భవనాల్లో 21వ ప్లేస్ లో ఉన్న ఈ భవనం మంగళవారం చైనీయులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఒక్క ఉదుటున అందరు పరిగెత్తేలా చేసింది. భవనాలు కదులుతాయా..? అంటే ఎప్పుడో భూకంపం వచ్చినప్పుడు అని అందరికి తెలిసిందే.. కానీ సెగ్ ప్లాజా మాత్రం ఏ భూకంపం రాకుండానే అటు ఇటు ఊగిపోయింది.

ఆకాశ హర్మ్యాల్ని తాకే ఆ భవనం ఎలాంటి భూకంపం లేకుండానే దానికదే ఊగిపోవటంతో అక్కడి వారు వణికిపోయారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగు లంకించుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి భవనంలో ఉన్నవారందరిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. భవనం ఊగటానికి కారణం ఏమిటన్నది ఇంకా తేల్లేదు.. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.. ఒకవేళ దెయ్యం వచ్చి బిల్డింగ్ ని ఊపిందేమోనని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed