- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ సెర్చ్ ఫిల్టర్స్‌లో.. కొవిడ్ రిలేటెడ్ ఇన్ఫో
దిశ, ఫీచర్స్: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే పదం ట్విట్టర్ పిట్టకు సరిగ్గా సరిపోతుంది. ట్విట్టర్ గూట్లోని పొట్టి పదాలు ఇప్పటికే గట్టి ఉద్యమాలకు వేదికగా నిలిచాయి. ట్విట్టర్‌ను సరిగ్గా వినియోగించుకుంటే అదో శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది అనేందుకు ఈ ఉద్యమాలే ఉదాహరణ. కాగా కొవిడ్ కల్లోల సమయంలోనూ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ ప్రజలకు ఎంతో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్ సెర్చ్ ఆపరేటర్లను ఎలా ఉపయోగించుకోవచ్చు? కొవిడ్‌కు సంబంధిత విషయాలు ఏమున్నాయో తెలుసుకుందాం!
కరోనా సెకండ్ వేవ్ విశృంఖలంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. బెడ్స్, ఆక్సిజన్, ఐసోలేషన్ వివరాలకు సంబంధించి ప్రభుత్వ హెల్ప్‌లైన్స్, ఫిర్యాదుల పరిష్కార విధానాల స్థానంలో నెటిజన్లు, పౌరులు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించడం ప్రారంభించారు. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో పాటు వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ చాట్ యాప్స్‌ను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సహాయం కోరుతూ వచ్చే వేలాది ట్వీట్ల మధ్య మనకు అవసరమైన సమాచారం/ప్రతిస్పందనలను కనుగొనడం కష్టం. ఈ సమస్యకు ట్విట్టర్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఆప్షన్స్(సెర్చ్ ఫిల్టర్స్) పరిష్కారం చూపింది. ఇది స్పెసిఫిక్ కీవర్డ్స్, ఫ్రేజెస్(పదబంధాలు), హ్యాష్‌ట్యాగ్‌లు, స్పెసిఫిక్ లాంగ్వేజ్, భౌగోళిక స్థానం, నిర్దిష్ట తేదీ, ట్వీట్స్, రిప్లేస్ ఫ్రమ్ స్పెసిఫిక్ అకౌంట్ వంటి ట్వీట్‌లను శోధించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ సెర్చ్ ఫంక్షన్స్ ఉపయోగించి వినియోగదారులకు అవసరమైన విషయాలను స్పష్టంగా కనుగొనవచ్చు.
ఉదా : సెర్చ్ బార్‌లో ‘ఆక్సిజన్ సిలిండర్ వెండర్’ అని టైప్ చేయగానే.. ఆ పదాలను కలిగి ఉన్న ట్వీట్లను డిస్‌ప్లే చేస్తుంది.
* పర్టికులర్ ఏరియా నుంచి పోస్ట్ చేసిన అన్ని ట్వీట్లను కనుగొనాలనుకుంటే ‘హాస్పిటల్ బెడ్స్’ నియర్ : ‘ముంబై’ అని టైప్ చేస్తే ఆ ప్రాంతానికి చెందిన ప్రతీ ట్వీట్‌ను చూడవచ్చు.
* స్పెసిఫిక్ హ్యాష్‌ట్యాగ్ టైప్ చేసి, దానికి సంబంధించిన ట్వీట్స్ చూడొచ్చు. ఉదా.. కొవిడ్ ఎస్‌వోఎస్ (#COVIDSOS) నియర్ : ‘ఢిల్లీ’.
లైఫ్-సేవింగ్ మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సేకరించడానికి చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడుతున్న సమయంలో ఈ ట్విట్టర్ టూల్స్ వినియోగదారులను నావిగేట్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా చాలా ముఖ్యం.