డెమోస్టిక్ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్

by Shyam |
డెమోస్టిక్ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్
X

కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా మారుతున్న తరుణంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయంలో ఇక మీదట డెమోస్టిక్ విమానాల్లో వస్తున్న ప్రయాణికులకు కూడా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ విధానం రేపటి నుంచి అమలులోకి రానుంది. వైరస్ ప్రభావం విదేశాల నుంచి వస్తున్న వారిపై ఎక్కువగా ఉంటుండడంతో.. తొలుత వారికి మాత్రమే స్ర్కీనింగ్ నిర్వహించారు. అనంతరం వైరస్ తీవ్రత పెరగడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులనే రద్దు చేసుకున్నారు. అయితే, విదేశాల నుంచి వస్తున్న వారు నేరుగా మన రాష్ట్రానికే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు ప్రయాణిస్తున్నారని గమనించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

tag: carona effect, screening, passengers, domestic flights, telangana

Advertisement

Next Story