వరద నీటిలో ప్రాణాలు తీసే తేళ్లు.. వైద్యశాఖ అప్రమత్తం

by vinod kumar |
scorpion
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్టులోని దక్షిణ నగరమైన అస్వాన్‌‌ను భారీ తుఫానులు ముంచెత్తింది. వరద నీరు వీధుల్లోకి, ఇళ్లలోకి ప్రవేశించాయి. అయితే ఆ వరద నీటితో పాటు ప్రమాదకరమైన తేళ్లు కూడా వస్తున్నాయి. ఈ తేళ్లు కుట్టి ముగ్గురు మరణించగా, మరో 450 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఈ తేళ్లు ఎక్కువగా పర్వతాలు, ఎడారులకు సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్నాయని, అక్కడ ఉన్న వైద్య కేంద్రాలకు యాంటీ-వెనమ్‌ని అదనపు మోతాదులో అందించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

సెయింట్ లూయిస్ జూ ప్రకారం.. ఈజిప్షియన్ కొవ్వు తోక గల తేలుకు ఈజిప్టు నిలయంగా ఉంది. ఇది ‘ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన తేళ్లలో ఒకటి’గా గుర్తించారు. అత్యంత విషం ఉన్నందున అది కుట్టగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు మెలితిప్పడం, అలాగే తల సంబంధించిన సమస్యలు తలెత్తి మరణం సంభవిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

భారీ వర్షం కారణంగా తేళ్లు వరదలో కలిసి వీధుల్లోకి కొట్టుకువస్తున్నాయని, వాటితో పాటు పాములు కూడా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని ఆసుపత్రులు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అస్వాన్ గవర్నర్ అష్రఫ్ అట్టియా మాట్లాడుతూ ప్రజలను ఇంట్లోనే ఉండాలని, అంతేకాకుండా చెట్లు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరారు. మరోవైపు రాబోయే 24 గంటలపాటు ప్రతికూల వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఈజిప్టు వాతావరణ శాఖ (ఈఎంఏ) తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed