వెంటిలేటర్ అవసరాన్ని గుర్తించే కృత్రిమ మేధస్సు

by vinod kumar |
వెంటిలేటర్ అవసరాన్ని గుర్తించే కృత్రిమ మేధస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్ పేషెంట్లను ట్రీట్ చేయడం వైద్యులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ వైరస్ సోకిన పేషంట్లలో ముఖ్యంగా ఎవరికి వెంటిలేటర్ అవసరమో గుర్తించడం ఇబ్బందిగా మారుతోంది. కొందరిలో వైరస్ సోకిన కొద్ది సమయంలోనే లక్షణాలు తీవ్రమవుతుండటం, మరికొందరిలో నెమ్మదిగా ప్రభావం చూపిస్తుండటం ఇందుకు కారణం. దీంతో డాక్టర్లు వయసును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ కారణంగా వెంటిలేటర్ అవసరమైన యువకులు ఇబ్బంది పడుతుండగా, లక్షణాల ప్రభావం పెద్దగా లేని వృద్ధులకు వెంటిలేటర్ సదుపాయం దొరుకుతోంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడేయటానికి ఎవరికి వెంటిలేటర్ అవసరమో నిర్ణయించే కృత్రిమ మేథస్సును తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా వయసు, పొగతాగే అలవాటు, ఆస్తమా లక్షణాలు, హృద్రోగ సమస్యలను ప్రమాణికంగా తీసుకుని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తోందని పరిశోధనలు చేస్తోన్న యూనివర్సిటీ ఆఫ్ కొపెన్‌హెగన్ చీఫ్ ఫిజీషియన్ ఎస్పెన్ సోలెం తెలిపారు. అంతేకాకుండా పేషెంట్ల ఎక్స్ రే లు, పరీక్ష ఫలితాలు, హెల్త్ రికార్డుల వివరాలను విశ్లేషించి ఎవరికి వెంటిలేటర్ అవసరమో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తుంది. దీంతో వెంటిలేషన్ అవసరమైన పేషెంట్లను సులభంగా గుర్తించే అవకాశం వైద్యులకు కలుగుతుంది.

Tags: Artificial Intelligence, Corona, COVID 19, Ventilators, Asthma, Older patients, prediction, model

Advertisement

Next Story

Most Viewed