- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతితో శాస్త్రవేత్త సహజీవనం.. ఆ తర్వాత వాటిని మార్చి..
దిశ, సికింద్రాబాద్: మాట్రిమోని ద్వారా పరిచయమైన వ్యక్తి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. రెండు సంవత్సరాలుగా తనకి దొరకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, పోలీసుల ద్వారా కూడా తనకు న్యాయం దొరకడం లేదని యువతి (30) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019లో భారత్ మాట్రిమోనిలో పరిచయమైన విజయ్ కుమార్(37) ఓయూలో పీ.హెచ్.డి పూర్తి చేసి రెడ్డి ల్యాబ్‌లో శాస్త్ర వేత్తగా పని చేస్తున్నాడని తెలిపింది. ఇద్దరు అర్థం చేసుకొని తమ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో తనతో నాలుగు నెలలు సహజీవనం చేశానని చెప్పింది.
పెళ్లి గురించి అడగడంతో తనని దూరం పెడుతూ వచ్చాడని, అంతలోనే తన తండ్రి చనిపోవడం, తర్వాత లాక్ డౌన్ కారణాలతో కొద్ది రోజులు దూరం పెరిగిందన్నారు. తర్వాత తనను కలిసి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడినా కనికరం చూపకుండా మర్చిపో అన్నాడని తెలిపింది. దీంతో విజయ్ కుమార్ పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తర్వాత అమీన్ పూర్ స్టేషన్‌కు కేసు బదీలీ అయినట్లు చెప్పింది. మొదట్లో పోలీసులు అతడిని పిలిపించి మాట్లాడితే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకొని నెలలు గడుస్తున్నా అతడి నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు 420,417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఉద్యోగానికి కూడా వెళ్లకుండా ఇళ్లు కూడా మార్చి, నంబర్ మార్చేసి దొరకకుండా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా అందరూ సహకరించాలని కోరింది.