క్లాస్ రూంలో కామ పాఠాలు..

by Anukaran |
క్లాస్ రూంలో కామ పాఠాలు..
X

దిశ వెబ్ డెస్క్ : గురుదేవో గురుబ్రహ్మ.. అంటే గురువు దేవునితో సమానమని, అజ్ఞనాలను తొలిగించి విజ్ఞానాన్ని అందించేవారిని గురువు అంటారు. అలాంటి గురువు విద్యా బుద్ధులు నేర్పించి, భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దాలి. కానీ అలాంటి ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు తన వృత్తికే కళాంకం తెచ్చాడు. ఆన్ లైన్ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థీనీలకు సెల ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీరా ఈ విషయం ఆనోట ఈనోట విద్యార్థుల తల్లి దండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిని బంధించారు.

పుస్తకం వదిలి..సెల్ పట్టి..

ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. కరోనా మూలాన ఏడాదీన్నార పాఠశాలలు తెరుచుకోలేదు, ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని చెప్పడంతో. గోట్కూరి గ్రామంలో శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభంమైనవి. దీంతో తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోయినవన్నీ నేర్చుకుటారని, ఆనందంగా తమ పిల్లలని పాఠశాలకు పంపించారు. కానీ ఆ పాఠశాల ఖదీర్‌ ఇంగ్లిష్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ పాఠాలు చెప్పాల్సింది పోయి శృంగార పాఠాలు వల్లించడంలోనే లీనమైపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిన్నారులు తల్లిదండ్రులు అదేరోజు హెచ్ఎం రాధాకృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు.

ఉపాధ్యాయుడిని గ్రామస్తులు ఏం చేశారంటే..

సోమవారం పాఠశాలకు యథావిధిగా వచ్చిన ఉపాధ్యాయుడు ఖదీర్‌ను తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలలో నిర్భందించారు. అశ్లీల వీడియోలు చూపించడం పై మండిపడ్డారు. కొందరు దాడికి యత్నించారు. ఈ సమాచారం అందుకున్న తాంసి ఎస్సై శిరీష పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. డీఈవో రవీందర్‌రెడ్డి ఉపాధ్యాయుడి సెల్ సీజ్‌ చేసి , సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story