- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగష్టు 6న విడుదల కానుండగా, 13వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 24న పోలింగ్ ఉంటుంది. అదే రోజున ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
కాగా, ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణను వైసీపీ సర్కార్ రాజ్యసభకు పంపించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం భర్తీకే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామా చేసిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్ విడుదల చేశారు.