- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రాండెడ్ వస్తువుల పేరిట మోసాలు
దిశ, శేరిలింగంపల్లి: పృథ్వీకి బ్రాండెడ్ వస్తువులు అంటే మోజు. వేసుకునే బట్టల నుంచి తాగే నీరు వరకు మంచి బ్రాండ్ అయి ఉండాలని కోరుకుంటాడు. అయితే ఇటీవల బర్త్ డే కోసమని వాళ్ల నాన్న గిఫ్ట్‌గా బ్రాండెడ్ అనుకుని గమనించకుండా సేమ్ పోలికలతో ఉన్న మరో కంపెనీ వాచ్ తెచ్చాడు. అది గమనించిన పృథ్వీ వాళ్ల నాన్నతో గొడవకు దిగాడు. ఇది మాత్రమే కాదు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి.
మేము చూసింది నిజమే.. విన్నది వాస్తవమే మా కళ్లతో మేమే స్వయంగా చూసాం. మా చెవులతో మేమే విన్నాం.. అంటే ఎందుకైనా మంచిది మీరు చూసింది, విన్నది నిజమో కాదో ఓ సారి మళ్లీ రీ చెక్ చేసుకోండి. అదేంటి అంటారా.. ఇప్పుడు మార్కెట్లో ఏ వస్తువును చూసినా.. సేమ్ బ్రాండెడ్ వస్తువులను పొలినవే కనిపిస్తున్నాయి. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారో లేదో కానీ వస్తువులను పోలిన వస్తువులు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మార్కెట్లో. సేమ్ టూ సేమ్ అదే వస్తువు ఎక్కడా తేడా ఉండదు మీరు ఒకటికి రెండుసార్లు పక్కాగా గమనించి చూస్తే తప్పా. బ్రాండెడ్ వస్తువుల పేరిట నకిలీలు రెడీ చేసి మార్కెట్లోకి, జనాల మీదకు వదులుతున్నారు కేటుగాళ్లు. అవే అసలైనవని కొన్నాకా చూసి అవాక్కవుతున్నారు జనాలు. మేం మోసపోయమని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
అంతా కల్తీమయం..
కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం వాడాలన్నా భయపడే పరిస్ధితి. తినే తిండి నుండి మొదలు కాళ్లకు వేసే షూస్ వరకు దేన్నీ వదలడం లేదు కల్తీ రాయుళ్లు. పైన పటారం..లోన లొటారం అనే విధంగా బ్రాండెడ్ వస్తువుల పేరిట డూప్లికేట్స్ తయారు చేసి..కస్టమర్లకు టోపీ పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. వాటి ఆకారం చూస్తే సూపర్ గా కనిపిస్తోంది. క్వాలిటీ మాత్రం అధ్వాన్నంగా ఉంటుంది. అచ్చం బ్రాండెడ్ వస్తువులను పోలి ఉండే వస్తువులనే తయారుచేసి జనాలను నిలువునా ముంచేస్తున్నారు. ఈ డూప్లికేట్ వస్తువులను చూస్తే అసలేదో, నకిలీ ఏదో గుర్తుపట్టడం అంత ఈజీకాదు. అంతలా సేమ్ టూ సేమ్ ఉంటున్నాయి. జస్ట్ ఒక్క అక్షరం తేడాతో బ్రాండెడ్ వస్తువులకు రీప్లేస్ లా ఉంటున్నాయి. అదే బ్రాండ్ అనుకుని కొనేసి ఇంటికెళ్లి చూసి మోసపోతున్నారు.
ఒకటికి రెండు సార్లు రీ చెక్..
ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడైనా ఈ డూప్లికేట్ వస్తువులు అమ్మేస్తున్నారు. చెప్పులు, షూస్‌ల నుంచి మొదలైన ఈ బ్రాండెడ్ మోసాలు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, కిరాణా షాప్స్, బట్టల షాపులు అన్నింటి విషయంలోనూ కనిపిస్తున్నాయి. అడిడాస్ అనే ఫేమస్ ఇంటర్నేషనల్ షూస్ బ్రాండ్. కానీ దీన్నీ రీప్లేస్ చేస్తూ అబిదాస్ అనే డూప్లికేట్‌ను సృష్టించారు కేటుగాళ్లు. అలాగే రీబక్‌కు రీబాక్ అని నైక్ షూస్‌కు నైకీ అని, ప్యారగాన్‌కు ప్యారగున్ అని ఇలా ప్రతీ బ్రాండ్ కు ఒక్క అక్షరం తేడాతో డూప్లికేట్‌ను సృష్టించేస్తున్నారు. ఇలా ఒక్క అక్షరం తేడాతో బ్రాండ్ మారడమే కాదు. అందులోని క్వాలిటీ మారుతుంది. తద్వారా వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోవాల్సి వస్తుంది.
ఏది అసలు.. ఏది నకిలీ..
ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లో కిన్లీ, బిస్లరీ కంపెనీల వాటర్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు వీటికి డూప్లికేట్ తయారు చేసి ఒక అక్షరాన్ని అటు ఇటుగా రాసి లేబుల్స్ ముద్రించి అమ్మకాలు సాగిస్తున్నారు. మార్కెట్లు, బస్టాపుల్లో అవే వాటర్2ను సేమ్ రేట్ కు అమ్మకాలు చేస్తున్నారు. బస్సులో ఉండి బయట అమ్మే వాటర్ బాటిల్ సేమ్ కిన్లీ, బిస్లరీ వాటర్ లాగే కనిపిస్తుంది. తీరా కొని నీళ్లు తాగితే అది అసలైన కంపెనీ వాటర్ కాదని తెలుస్తోంది. మోసపోయామని గ్రహించేలోపే బస్సు చాలా దూరం వచ్చేస్తుంది. చేసేదేమీ లేక ఆ నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. వంట నూనెల విషయంలోనూ ఇలాంటి మోసాలు నిత్యకృత్యం అయ్యాయి. మార్కెట్లో ఇప్పుడు రకరకాల పేర్లతో వంటనూనెలు వచ్చేశాయి. వీటిలో చాలా వరకు డూప్లికేట్ వే ఉంటున్నాయి. వీటి శుభ్రత విషయంలోనే కాదు తయారీ విషయంలోనూ అనేక పొరపాట్లు చేస్తున్నారు తయారీదారులు. కుళ్లిన కళేబరాలతో తయారు చేసిన వంట నూనెలు కూడా మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎక్కువ..
నగరంలో ఎక్కడ పడితే అక్కడ గొడుగులు వేసుకుని ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మేస్తుంటారు. కొందరు షాపుల దగ్గర, జనాలు ఉండే చోట్ల బ్రాండెడ్ కంపెనీ పేర్లతో ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచ్ లు విక్రయిస్తుంటారు. తక్కువ ధరకే వస్తున్నాయని కొనుగోలు చేస్తే అవి మూడునాళ్ళకే పాడవుతుంటాయి. ఇవన్నీ కూడా ఫేక్ కంపెనీలు సృష్టించే వస్తువులే అని చెప్పాలి. ధర తక్కువే బ్రాండ్ నేమ్ అదే అని కొనే ముందు ఒకటికి రెండుసార్లు రీ చెక్ చేసుకోవడం మర్చిపోకండి. తస్మాత్ జాగ్రత్త.