నెలకు రూ.1000 కడితే లక్షా 59వేలు సొంతం చేసుకోవచ్చు

by Anukaran |
నెలకు రూ.1000 కడితే లక్షా 59వేలు సొంతం చేసుకోవచ్చు
X

దిశ,వెబ్‌డెస్క్: భవిష్యత్ అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం చాలా అవసరం. కానీ కరోనా కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. మరికొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. స్కీంలో భాగంగా నెలకు రూ.వెయ్యి కడితే 1లక్షా 59వేలు సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ స్కీమ్‌కు ఎవరు అర్హులు? నెలకు వెయ్యి ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఎంత కడితే ఎంత ఇంట్రస్ట్ పడుతుందనే విషయాల గురించి తెలుసుకుందాం.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ లో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. స్కీమ్ లో భాగంగా బ్యాంక్ విధించిన నిర్ణీత సమయంలో నెలకి రూ.వెయ్యికట్టాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ల మినహా మిగిలిన వారికి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఎంతంటే?

ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లెక్కల ప్రకారం ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ లో 3నుంచి 5 సంవత్సరాల కాలంలో 5.3శాతం వడ్డీ, 5 సంవత్సరాలు దాటితే 5.4శాతం వడ్డీగా వస్తుంది.

సీనియర్ సిటిజన్లకు రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఎంత వస్తుందంటే ?

సీనియర్ సిటిజన్లు ఎవరైనా రికరింగ్ డిపాజిట్ చేస్తే మహిళలైనా, పురుషులైనా అదనంగా 0.80శాతం వడ్డీగా పొందవచ్చు. అంటే 5సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి డిపాజిట్ కొనసాగిస్తే 6.2శాతం వడ్డీ పొందవచ్చు.

నిర్ణీత సమయంలో డిపాజిట్ కట్టకపోతే ఫైన్ ఎంతపడుతుందంటే?

ఈ స్కీమ్ లో జాయిన్ అయిన అకౌంట్ హోల్డర్లు ప్రతి నెల బ్యాంక్ విధించిన గడువులోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే 5సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి డిపాజిట్ చేసేవారికి నెలకు రూ.100కి రూ.1.50 రూపాయల్ని బ్యాంక్ అధికారులు వసూలు చేస్తారు. 5సంవత్సరాలు కంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఖాతాదారులకు నెలకు రూ .100కు రూ.2.00 వసూలు చేస్తారు. ఒకవేళ వరుసగా ఆరు నెలల పాటు డిపాజిట్ చేయకపోతే అకౌంట్‌ను క్లోజ్ చేసి కట్టిన మొత్తాన్ని సంబంధిత అకౌంట్ హోల్డర్ కు అందిస్తారు.

రూ.వెయ్యి కడితే లక్షా 59వేలు ఎలా వస్తాయి?

ఒకవేళ డిపాజిట్ చేసే వ్యక్తి వయస్సు 60కంటే తక్కువ ఉంటే 10సంవత్సరాల పాటు నెలకు రూ. 1000 కడితే బ్యాంక్ మనకు 5.4శాతం వడ్డీ అందిస్తుంది. దాన్ని మనం క్యాలిక్లేట్ చేసుకుంటే 10సంవత్సరాలకు నెలకు రూ.1000 చొప్పున 120నెలల పాటు 5.4శాతం బ్యాంక్ వడ్డీ ఇస్తే రూ.1,59,155వస్తుంది.

Advertisement

Next Story