కీలక మైలురాయిని సాధించిన ఎస్‌బీఐ

by Harish |
కీలక మైలురాయిని సాధించిన ఎస్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అరుదైన ఘనతను సాధించింది. గృహ రుణాల వ్యాపారంలో రూ. 5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ వినియోగదారులకు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి ఆఫర్లను బుధవారం ప్రకటించింది. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నది. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ విభాగం భారీ వృద్ధిని సాధిస్తోంది.

ఈ క్రమంలో గృహ రుణాలను తీసుకోవాలనుకునేవారికి ఎస్‌బీఐ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రోజుకు 1,000 మంది గృహ రుణాల వినియోగదారులకు తక్కువ వడ్డీలకే రుణాలను అందించాలని, ప్రాసెసింగ్ ఫీజును ఈ ఏడాది మార్చి 31 వరకు రద్దు చేయనున్నట్టు వివరించింది. సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీరేటుకే రుణాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రూ. 5 లక్షల కోట్ల మార్కును సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story