- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.8,931 కోట్లను సమీకరించనున్న ఎస్‌బీఐ
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ సుమారు రూ. 8,931 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఇన్వెస్టర్లకు బాసెల్ 3 నిబంధనలకు లోబడే బాండ్లను జారీ చేసి రూ. 8,931 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. నాన్-కన్వర్టబుల్, ట్యాక్సబుల్, సబ్-ఆర్డినేటెడ్, అన్‌సెక్యూర్డ్, ఫుల్లీ పెయిడెడ్ బాండ్స్‌తో ఈ మొత్తాన్ని సమీకరించడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ బాండ్ల ముఖవిలువ రూ.10 లక్షలు ఉండగా, పదిహేనేళ్ల కాల వ్యవధి, 6.80 శాతం కూపన్ రేటును ఇస్తారు. బాండ్ సబ్‌స్క్రైబర్లకు కాల్ ఆప్షన్ 10 ఏళ్లు ఉంటుందని ఎస్‌బీఐ వివరించింది. బాసెల్ 3 కేపిటల్ నిబంధనల ప్రకారం… బ్యాంకులు తమ మూలధన ప్రణాళిక ప్రక్రియను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కాగా, 2013 నుంచి విడతల వారీగా దేశీయ బ్యాంకులు బాసెల్ 3 నిబంధనలను అమలుపరుస్తున్నాయి.
Advertisement
Next Story