- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సత్యదేవ్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ

X
హీరో సత్యదేవ్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘47 డేస్’ సినిమాతో పలకరించిన సత్యదేవ్.. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం మాలీవుడ్ మూవీ ‘మహేసింతే ప్రతీకారం’ చిత్రానికి రీమేక్ కాగా.. సత్యదేవ్ మరో రీమేక్‌లో నటించనున్నాడని తెలుస్తోంది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టేల్’ చిత్రాన్ని నాగ శేఖర్ డైరెక్ట్ చేయబోతుండగా.. ఇందులో సత్యదేవ్‌ను హీరోగా ఎంచుకున్నట్టు సమాచారం. రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నాగ శేఖర్ పతాకంపై రూపొందుతుండగా.. సత్యదేవ్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించనుందని టాక్. కాగా ఈ సినిమాకు ఎమ్.ఎమ్. కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిచనున్నారు.
Next Story