- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి : ఎంపీ బలరాం నాయక్

దిశ, దుగ్గొండి: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అన్నారు. శనివారం దుగ్గొండి మండలకేంద్రంలోని రైతు వేదికలో మండల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. సత్య శారదా దేవి, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంధ్య రాణి లు పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ… భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భూమి విలువ రూ.5 లక్షల లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, అంతకంటే పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించారని తెలిపారు. సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు.
రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డులను నోటీసు బోర్డు పై ప్రచురిస్తారని అన్నారు. ధరణి పోర్టల్ లో అనేక తప్పులు ఉన్నాయని భూ భారతిలో ఎలాంటి తప్పులు దొర్లకుండా రైతులకు సరైన న్యాయం చేకూరుస్తామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, రెవెన్యూ డివిజనల్ అధికారిని ఉమారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ అనురాధ, తహసీల్దార్ రవిచంద్రా రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఏఓ మాధవి, ఎంపీవో శ్రీధర్ గౌడ్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.