‘గాడ్సే’గా సత్యదేవ్

by Jakkula Samataha |
‘గాడ్సే’గా సత్యదేవ్
X

దిశ, వెబ్‌డెస్క్ : వైవిధ్యమైన చిత్రాలతో పాటు, నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్న యంగ్ యాక్టర్ సత్యదేవ్. విలక్షణమైన నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌‌కు క్రేజీ ఆఫర్స్ వస్తుండగా.. తాజాగా ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కించుకుని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబోతో మళ్లీ రాబోతున్నట్లు తన కొత్త సినిమా అప్‌డేట్ ప్రకటించడంతో పాటు సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ కూడా రివీల్ చేశాడు.

సత్యదేవ్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’ కాగా, ఇలాంటి ఓ సరికొత్త కథాంశాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోపి గణేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కాగా వీరిద్దరూ కలిసి మరోసారి ప్రేక్షకులకు యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను ‘గాడ్సే’గా ప్రకటించిన మూవీ యూనిట్.. సత్యదేవ్ లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సత్యదేవ్ వైల్డ్ లుక్‌లో కనిపిస్తుండగా.. గోపితో మరోసారి సినిమా చేస్తున్నందుకు సత్యదేవ్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెల్లడించాడు.

‘బ్లఫ్ మాస్టర్ తర్వాత గోపి గణేశ్ అన్నతో మరోసారి కలిసి పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సారి మా కాంబోలో రాబోతున్న ‘గాడ్సే’ పక్కా యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌ అందించనుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది’ అని సత్యదేవ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story