ఈ రాశి వారికి గుడ్‌న్యూస్.. వారిని కలిసే అవకాశం

by Anukaran |
Panchangam
X

తేది : 2, అక్టోబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 11 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 57 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 42 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 4 ని॥
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకము
విశేషం
2. గాంధీజయంతి

మేష రాశి: దేవాలయాలను సందర్శించడం వలన మానసిక ప్రశాంతత. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. గందరగోళం వలన సరైన ఆలోచనలు రావు సమయం వృధా. కావాల్సినంత ధనం చేతికందుతుంది. దాన ధర్మాల వలన దైవ బలం తోడవుతుంది కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెడితే విజయం మీదే. ఆఫీసు పనులలో ఒత్తిడి సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.

వృషభ రాశి: పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. కొంతమందికి ఖరీదైన స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం. వ్యాపారంలో లాభాల కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కొంత మంది విద్యార్థులకు మంచి యూనివర్సిటీలో సీటు వస్తుంది. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చులు చేస్తారు. సుఖాల కోసం వెంపర్లాడకండి. ఫిట్ నెస్ పెంచుకోండి. బయటి భోజనం వలన అజీర్తి. కొందరు మీ దగ్గరికి అప్పు కోసం వస్తారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోండి లేకుంటే నష్టాలు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలలో ఒకరికి అనారోగ్యం వలన మానసిక అశాంతి.

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరుల తప్పుఒప్పుల గురించి అనవసరంగా మాట్లాడకండి. ఆఫీసు పనులు అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. తోటి ఉద్యోగులు, పై అధికారులు మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. కుటుంబ వ్యవహారాల గురించి భార్యతో గొడవలు వచ్చే అవకాశం. జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నించండి. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది.

కర్కాటక రాశి: సరైన ప్రణాళిక, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనులు అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. భార్యతో గొడవ పడకుండా సహనంతో ఆమె చెప్పేది వినండి. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. కొంతమంది నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంతమందికి ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. మీ పిల్లల అనారోగ్యం వలన మానసిక అశాంతి. స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి: అనుకున్న కార్యాలను పట్టుదలతో సాధిస్తారు. కొంతమంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేయండి. బంధువుల రాక కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. కుటుంబ వ్యవహారాల లోనికి వేరే వారిని రానీయకండి. ఆఫీసులో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వారు ఉన్నారు జాగ్రత్త. వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు లేకపోవచ్చు. కళ్ళ జబ్బులు మరియు వెన్నునొప్పి కి అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే అపార్ధాలు తొలగిపోతాయి.

కన్య రాశి: సరైన ప్రణాళిక వేయండి అనుకున్న కార్యాలను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ చమత్కార సంభాషణలను అందరూ ఇష్టపడతారు. ఆఫీసు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి. పెద్ద వారి సలహా తీసుకోండి. ఉద్యోగ లేక వ్యాపారపరంగా ప్రయాణం. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. దుబారా ఖర్చులను నివారించండి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టండి. పంటి నొప్పి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపాలి అందువలన మానసిక అశాంతి.

తులారాశి: సంఘంలో పేరుప్రతిష్టలు. కొంతమంది ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. కొంతమంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత స్నేహితులను కలుస్తారు. నూతన గృహం కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఫిట్ నెస్ కు చేసిన ప్రయత్నాలు సఫలం. అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో మీ పని సామర్థ్యాన్ని పై అధికారులు మెచ్చుకుంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది.బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో రాజీకి వస్తున్నారు పాత గొడవలు తవ్వకండి. ఆనందించండి.

వృశ్చిక రాశి: నూతన గృహం కొనుగోలుకు చేసిన ప్రయత్నాలు సఫలం. అనుకున్న కార్యాలను ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులకు వారి ప్రగతి గర్వకారణం. ఆఫీసులో మీ పని సామర్థ్యం పై అధికారుల, తోటి ఉద్యోగుల ప్రశంసలు. వ్యాపారంలో లాభాలు కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టబోయే పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంటికి వచ్చిన అతిథుల తో మీ మొరటు వ్యవహారం కుటుంబ సభ్యులను బాధిస్తుంది. కావలసినంత ధనం చేతికందుతుంది. దుబారా అనవసరపు ఖర్చులను నివారించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాన్ని పూర్తిచేస్తారు. . కావలసినంత ధనం చేతికందుతుంది. అనవసరపు దుబారా ఖర్చులను వదిలేయండి. మరింత సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. మీ పిల్లల ప్రగతి మీకు గర్వకారణం ఆఫీసు పనులలో నిర్లక్ష్యం వద్దు. దాని వల్ల తప్పులు జరిగే అవకాశం. భార్య భర్తల మధ్య పాత విషయాల గురించి చిన్న గొడవలు. ఈ కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: అనుకూలమైన రోజు. అనుకున్న కార్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగం తగ్గుతుంది. మీ పిల్లలు చదువు మీద కన్నా వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టి సమయం వృధా చేస్తున్నారు గమనించండి. మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు తెస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు మీ సామర్ధ్యం పై అధికారుల ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. చెడు అలవాట్లను వదిలి వేయండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీ భార్య ప్రవర్తన మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి లేకుంటే నష్టాలు. ఆఫీసు పనిలో తోటి ఉద్యోగుల సహకారం వలన అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కావాల్సినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

మీన రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. భవిష్యత్ అవసరాల కోసం సరైన పెట్టుబడులలో పెట్టండి. ఫిట్నెస్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో వాదోప వాదాలకు దిగకండి. పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed