తెరుచుకున్న సరళాసాగర్ సైఫాన్స్

by Shyam |
తెరుచుకున్న సరళాసాగర్ సైఫాన్స్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సుమారు 11 సంవత్సరాల తరువాత ప్రఖ్యాతి గాంచిన సరళా సాగర్ సైఫాన్స్ తెరుచుకున్నాయి. ఎడతెరుపు లేని వర్షం కారణంగా సరళా సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈరోజు ఉదయానికి సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో సైఫన్లు తెరుచుకున్నాయి.

వనపర్తి జిల్లాలోని మదనాపూర్ మండలం కేంద్రంలో ప్రపంచంలో రెండవది, ఆసియా ఖండంలో మొదటి ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కలిగిన సరళాసాగర్ ప్రాజెక్టు సైఫాన్స్ తెరుచుకున్నాయి. దాదాపు 11 సంవత్సరాల తరువాత 07 హుడ్ సైఫాన్స్ మళ్ళీ తెరుచుకోవడంతో పరిసర ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును వనపర్తి రాజుల కాలంలో నిర్మించడం విశేషం. నాటి నిర్మాణం, ప్రాజెక్టులో 17 హుడ్ సైఫాన్, ప్రేమిoగ్ సైఫాన్లను ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed