- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కీసరలో లైకా కాయిన్ స్కీంల పేరుతో ఘరానా మోసం

దిశ,కీసర : కీసరలో లైకా కాయిన్ పేరుతో మోసాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్లు.రూ.10 వేలు పెడితే రూ.30 వేలలాభాలు వస్తాయని నమ్మబలికిన పెట్టిన మాయగాళ్లు.పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు అంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.కీసరకు చెందిన రాగుల శ్రీరంగం లైకా కాయిన్ లో డబ్బులు పెడితే పెట్టిన డబ్బులకు మరింత లాభం వస్తాయి అని అతి ఆశకు పోయి లైకా కాయిన్ 11 లక్షల రూపాయలు డబ్బులు పెట్టాడు.చివరికి నమ్మిన స్నేహితుడే స్వామి నట్టేట ముంచుతాడు అని మరిచిపోయాడు.చివరికి మోసపోయాను అని తెలుసుకున్న బాధితుడు రాగుల శ్రీరంగం మోసపోయామని గ్రహించి మంగళవారం కీసర పోలీస్ స్టేషన్ లో స్వామి పై ఫిర్యాదు చేశాడు.విషయం తెలుసుకున్న మరి కొందరు బాధితులు వీరేంద్ర,బ్రహ్మ చారిలు కూడా కీసర పోలీసులను ఆశ్రయించారు.
కీసర సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ బాధితులు నుండి ఫిర్యాదు వచ్చింది ఎలా అసలు లైకా కాయిన్ లో డబ్బులు ఎవరు పెట్టించారు.అలాగే ఎంత వరకు లైకా కాయిన్ లో డబ్బులు పెట్టారు అనే కోణంలో విచారణ చేస్తున్నాం అని తెలిపారు.ఇలా ఆన్ లైన్ ద్వారా అమాయక ప్రజలను కొందరు మోసగాళ్లు మోసం చేస్తున్నారు అని ప్రజలకు తెలిసే విధంగా ప్రకటనలు చేస్తున్న ఇలా మోసపోతున్నారు అని అన్నారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన బంధువులు చెప్పిన ఆన్ లైన్ లో డబ్బులు పెట్టొద్దు పెట్టి మోసపోవద్దు అని మీడియా ద్వారా తెలిపారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు.