దంగల్ నటికి ఎమర్జెన్సీ సర్జరీ!

by Shyam |
దంగల్ నటికి ఎమర్జెన్సీ సర్జరీ!
X

‘దంగల్’ సినిమాలో బబిత ఫోగట్ పాత్రలో కనిపించిన నటి సన్యా మల్హోత్రా ప్రమాదానికి గురైంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సన్య.. వంట చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. బ్రేక్ ఫాస్ట్ కోసం పచ్చడి తయారు చేస్తుండగా అనుకోకుండా బ్లెండర్ మూతపడిపోయిందట. దాన్ని తిరిగి పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చేయి బ్లెండర్‌లోకి వెళ్లడంతో బ్లడ్ బాగా పోయిందట. స్పృహ తప్పే టైమ్‌లో ఫ్రెండ్‌కు కాల్ చేయడంతో తను వచ్చి దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారట. అక్కడ కరోనా టెస్ట్ చేశాకే.. ట్రీట్‌మెంట్ ప్రారంభించినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో రెండు చోట్ల ఫ్రాక్చర్, బోన్ డిస్‌లొకేషన్ అవడంతోపాటు చేతికి తీవ్రంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే సర్జరీ చేయాలని సూచించారట వైద్యులు.

Advertisement

Next Story