లాక్ డౌన్ లో రీచార్జ్ అవుతున్నా : సంజయ్ దత్

by Shyam |
లాక్ డౌన్ లో రీచార్జ్ అవుతున్నా : సంజయ్ దత్
X

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ లాక్ డౌన్ సమయాన్ని తనను తాను రీచార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజయ్… నటన అనేది మెంటల్ గా, ఫిజికల్ గా డిమాండ్ చేస్తుందని తెలిపాడు సంజయ్. ఈ ఐసోలేషన్ టైమ్ లో నేను చేయబోయే పాత్రల గురించి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నాడు. ఒక పాత్ర గురించి ప్రిపేర్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందని .. కాని క్లిష్టమైన పాత్రలను చేయడాన్ని ఎంజాయ్ చేస్తానని తెలిపాడు.

కాగా ఎక్సర్సైజ్, వర్క్ ఔట్, యోగా చేయడం వల్ల మంచి లైఫ్ స్టైల్ ను డిజైన్ చేసుకోగలమని చెప్తున్నాడు సంజయ్. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయినా సరే… ఫుడ్ కంట్రోల్ చేస్తున్నానని.. డైట్ ఫాలో అవుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడినే ఉన్నా.. కుటుంబంతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాను అని తెలిపాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు టైమ్ పరుగెడుతూనే ఉంటుందన్న సంజయ్ దత్.. ఫ్యామిలీని గొప్ప సంపదగా అభివర్ణించాడు.

కాగా KGF చాప్టర్ 2, షంషరా, తోర్బాజ్, సడక్ 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా లాంటి ప్రాజెక్టులకు కమిట్ అయిన సంజయ్.. షూటింగ్ లను మిస్ అవుతున్నట్లు తెలిపారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక దూరం అనేది చాలా ముఖ్యమని.. ప్రజలు అంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, మంచి ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలని సూచించారు. వీలైనంత సహాయం చేయాలని కోరాడు.

Tags: Sanjay Dutt, Bollywood, Lockdown, Corona, Covid 19, CoronaVirus

Advertisement

Next Story