శాంసంగ్‌కు షాక్.. 9 ఏళ్లలో ఇదే మొదటిసారి!

by Harish |
శాంసంగ్‌కు షాక్.. 9 ఏళ్లలో ఇదే మొదటిసారి!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020లో కొవిడ్-19 సంక్షోభం కారణంగా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ పరిస్థితి ఒడిదుడుకులతో సాగింది. ఎక్కువ కాలంపాటు ఉత్పత్తి, సరఫరా నిలిచిపోవడంతో తయారీదారులకు ఇక్కట్లు తప్పలేదు. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు సరఫరా, విక్రయాల సమస్యలను అధిగమించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి. షావోమీ లాంటి బ్రాండ్లు మాత్రమే కరోనా సవాళ్లను అధిగమించి మెరుగైన అమ్మకాలను నిర్వహించగలిగాయి.

అయితే, శాంసంగ్ లాంటి బ్రాండ్ అమ్మకాల పరంగా డీలాపడింది. జీఎస్ఎం అరెనా సేకరించిన వివరాల ప్రకారం.. 2020 ఏడాదికి శాంసంగ్ 30 కోట్ల ఫోన్‌ల అమ్మకాల మార్కును చేరుకోలేకపోయిందని అంచనా వేసింది. ప్రస్తుత ఏడాదికి 27 కోట్ల మొబైల్‌ఫోన్ అమ్మకాలతో శాంసంగ్ 9 ఏళ్లలో మొదటిసారి 30 కోట్ల అమ్మకాల మార్కుకు వెనకబడిందని జీఎస్ఎం అరెనా అభిప్రాయపడింది. 2020, మూడో త్రైమాసికం చివరి నాటికీ 18.9 కోట్ల ఫోన్‌లను రవాణా చేసినట్టు శాంసంగ్ ధృవీకరించింది. కరోనా పరిస్థితుల్లో ఎక్కువే అనుకున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని శాంసంగ్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed