అందం కాదు.. అమ్మతత్వం ముఖ్యం : సమీరా రెడ్డి

by Shyam |
అందం కాదు.. అమ్మతత్వం ముఖ్యం : సమీరా రెడ్డి
X

హీరోయిన్ సమీరా ఒకప్పుడు యువకుల కలల రాకుమారి. సినిమాల్లో క్యూట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తూ యువత హృదయాలను దోచుకుంది. కానీ.. తర్వాత బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లయింది. అయితే… ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తన అవతారాన్ని చూసుకుని చాలా డిప్రెషన్‌కు లోనైందట సమీరా. 70 కిలోల బరువున్న తను ఏకంగా 105 కిలోలు పెరిగి అందవికారంగా కనిపిస్తున్నానని చాలా ఏడ్చేసదట. ఏంటి అంత అందమైన హీరోయిన్ ఇలా అయిపోయింది? జనాలు అనుకుంటుంటే మరింత బాధపడేదట. డెలివరీ తర్వాత కూడా కొడుకును చేతుల్లోకి తీసుకుని మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు కూడా ఇష్టపడలేదట సమీరా. వారం రోజుల తర్వాతే బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూసిందట. కారణం ఆ బిడ్డ కడుపులో పడ్డాకే కదా నేను అందవిహీనంగా మారాననే భావం ఆమెలో ఉండిపోవడం… సమాజం కూడా తన పట్ల, తన బాడీ షేమింగ్ పట్ల జాలి చూపడం.. కామెంట్స్ చేయడంతో అలా అయిపోయిందట.

కానీ ఆ తర్వాత ఆమె రియలైజ్ అయిందట. పది మంది మెప్పుకోసం నేనెందుకు ప్రయత్నించాలి. నా హార్మొన్స్ ప్రభావం వల్ల నేను ఇలా అయ్యాను.. పైగా తల్లిగా మరో మెట్టు ఎదిగాను.. నేనెందుకు సిగ్గుపడాలి.. పైగా నేను ఆనందించాలి కదా అని అనుకుందట. ఓ బిడ్డకు జన్మనివ్వడం పూర్వజన్మ సుకృతమని భావించాక … మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమయిందట. అందుకే తనలాగా ఆలోచించే వారికి కళ్లు తెరిచేలా ఓ పాఠం చెప్పాలనుకుంది సమీరా. సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫోటో షూట్ చేస్తూ.. కాబోయే తల్లులకు పలు సూచనలు ఇస్తూ ఇన్స్‌పైర్ చేసింది. తల్లి అయ్యే అదృష్టం పొందడం వరమని.. ఆ సమయంలో అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పింది. నువ్వు నువ్వులా ఉండాలే తప్పా… మరొకరిని మెప్పించేందుకు అందంగా మారాలనే ఆలోచన ఎందుకు అనే కాన్సెప్ట్‌తో ప్రచార కార్యక్రమాలు చేసింది. ఆ ప్రమోషన్స్ చూసిన చాలా మంది తల్లులు తనకు థాంక్స్ చెప్పారని చెప్తోంది సమీరా. కిడ్ స్టాప్ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మీరు మీలా ఉండండి అంతే… ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేయండి.. సెలబ్రేట్ చేసుకోండి అని పిలుపునిచ్చింది.

tags : Sameera Reddy, Kids Stop Press, Baby Bump, Photoshoot

Advertisement

Next Story

Most Viewed