- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రకృతి ప్రియమైన శకుంతల సమంతనే..
దిశ, వెబ్‌డెస్క్ : ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ‘శాకుంతలం’ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రకృతికి ప్రియమైన ‘శకుంతల’ ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. ‘ప్రేమించిన ప్రేమను మరిచినా.. ఆ మరపురాని ప్రేమ కథ మిగిలే ఉంది’ అంటూ శకుంతల స్టోరీని తెరపై ఆవిష్కరించబోతున్న డైరెక్టర్ గుణశేఖర్.. కొత్త సంవత్సరం కానుకగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ‘రంగస్థలం, మజిలీ’ వంటి సినిమాల్లో తానేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సమంత అక్కినేని.. శకుంతల పాత్రలో ఒదిగిపోనున్నారంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సామ్ చేస్తున్న తొలి పురాణ ఇతిహాస చిత్రం ఇదే కాగా, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్. బిగ్ స్క్రీన్‌పై మరోసారి సామ్ మెస్మరైజ్ చేయనుందంటున్నారు. మణిశర్మ సంగీతం సినిమాకు మరింత బలం కానుండగా.. ఎగ్జైటింగ్‌గా ఉన్నామని చెప్తున్నారు. కాగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ‘శాకుంతలం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.