సల్మాన్ ఖాన్‌కు కరోనా ఎఫెక్ట్

by Shyam |
సల్మాన్ ఖాన్‌కు కరోనా ఎఫెక్ట్
X

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరికొత్త చిత్రం ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి’ అనేది ట్యాగ్ లైన్. మే 22న రిలీజ్ కానున్న మూవీపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా ప్రభావంతో భయపడిపోతున్న దేశాల్లో థాయిలాండ్ ఒకటి. కాగా… ఆ దేశంలోని అందమైన లోకేషన్లలో ఫిబ్రవరి చివర్లో ఓ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంది మూవీ యూనిట్. కానీ అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందనే టాక్ రావడంతో…. షూటింగ్ క్యాన్సల్ చేసుకున్నారట. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో థాయ్‌లాండ్‌లో జరిగే షూటింగ్ షెడ్యూల్‌ను ముంబైలోనే షూట్ చేస్తున్నారట.

‘రాధే’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పఠాని నటిస్తుండగా… రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్, అర్జున్ కనుగొ, జరీనా వాహబ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సాజిద్ వాజిద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో … జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ ఐటైం సాంగ్‌లో మెరవనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న సినిమాను సల్మాన్ ఖాన్, సొహేల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు.

Tags: Salman Khan, Coronavirus, Coronavirus Scare, Disha Patani, Radhe: Your Most Wanted Bhai, Randeep Hooda, Thailand

Next Story

Most Viewed