పాతవి ఉండగానే కియా కారు కొన్నాం.. కుండబద్దలు కొట్టిన సజ్జనార్

by Anukaran |
పాతవి ఉండగానే కియా కారు కొన్నాం.. కుండబద్దలు కొట్టిన సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో వాహనాల కొనుగోళ్లపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ స్పందించారు. ‘నాకూ ఓ కియా’ శీర్షికన దిశలో వచ్చిన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్​బాజిరెడ్డి గోవ‌ర్దన్‎కు కియా కారు కొనుగోలు చేసింది నిజమేనన్నారు. అయితే పాత కార్లను మాత్రం షెడ్డులో పెట్టలేదని, తాను, ఈడీ వాడుతున్నట్లు సజ్జనార్​వెల్లడించారు. ఆర్టీసీ పాత చైర్మన్​వాడిన టొయోటా ఫార్చునర్​కారు ఆయన రాజీనామా తర్వాత ఆర్టీసీ ఆధీనంలో ఉందని, తాను ఎండీగా నియామకం అయిన తర్వాత అదే కారును వాడుతున్నట్లు వివరించారు. ఇంకో ఇన్నోవా వాహనం కూడా ఉందని, దీన్ని గతంలో ఆర్టీసీ ఎండీ వాడారని, ప్రస్తుతం దీన్ని రెవెన్యూ, ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ వాడుతున్నట్లు తెలిపారు. కొత్తగా చైర్మన్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత బాజిరెడ్డి గోవర్దన్​కోసం కొత్త కియో కారును కొనుగోలు చేసినట్లు సజ్జనార్​ తెలిపారు.

Advertisement

Next Story