ఆర్టీసీ బస్సులో ప్రసవం.. సజ్జనార్ కీలక నిర్ణయం

by Shyam |   ( Updated:2021-12-08 05:30:04.0  )
rtc
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో ప్రజారవాణాపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగి బస్సులో ప్రయాణించేందుకు ముందు‌కు వస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో నవంబర్ 30న నాగర్ కర్నూల్, డిసెంబర్ 7న సిద్దిపేట దగ్గరలో ఇద్దరు గర్భిణులకు బస్సులోనే ప్రసవం జరిగింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది 108కు ఫోన్ చేసి వీరిని ఆసుపత్రులకు తరలించారు. దీనిపై స్పందించిన సజ్జనార్.. ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా బస్సులో జన్మించిన ఇద్దరు పిల్లలకు జీవితాంతం బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు పాస్ లు అందించనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.

రోడ్డెక్కిన కొండచిలువలు..ట్రాఫిక్ రూల్స్ తప్పలేదు….శాయంపేటలో ఆసక్తికర ఘటన

Advertisement

Next Story