- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ రద్దు చేస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన సింగపూర్ ఓపెన్ రద్దు కావడంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలు గల్లంతయ్యాయి. 2012 నుంచి వరుసగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సైనా తొలి సారిగా ఆ మెగా క్రీడలకు దూరం కానున్నది. ప్రస్తుతం ప్రపంచ 13వ ర్యాంకులో ఉన్న బి. సాయి ప్రణీత్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన పీవీ సింధు కూడా ఒలింపిక్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
మరోవైపు వరల్డ్ నెంబర్ 10 డబుల్స్ జోడీ సాత్వీక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా బెర్త్ సాధించారు. “సింగపూర్ ఓపెన్ నిర్వహించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో అంతర్జాతీయ ప్రయాణాలు కష్టమవుతున్నది. స్థానిక ప్రభుత్వం, అధికారులు కూడా టోర్నీని నిర్వహించేందుకు ఆసక్తి చూపించలేదు. అందుకే రద్దు చేశాం” అని బీడబ్ల్యూఎఫ్ అధికారులు స్పష్టం చేశారు.