Bhatti vikramarka : నిరుద్యోగులకు న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం : భట్టి విక్రమార్క

by M.Rajitha |   ( Updated:2025-04-04 11:00:34.0  )
Bhatti vikramarka  : నిరుద్యోగులకు న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి పవర్ ప్లాంట్(Yadardi Power Plant) లో ఇళ్ళు కోల్పోయిన వారికి శుక్రవారం టీజీజెన్కో(TGGENCO)లో ఉద్యోగ నియామక పత్రాలు(Appointment Orders) అందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Depyuty CM Bhatti Vikramarka). పవర్ ప్లాంటులో ఇళ్ళు, భూములు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), తాను బాగా ఆలోచించి.. అర్హులైన 112 మందికి నియామక పత్రాలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆర్థికశాఖలో వర్క్స్ అండ్ అకౌంట్స్ లో 51 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్య సందేశాన్ని అభ్యర్థులకు తెలపమన్నారని.. అది ఏమిటంటే, తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యార్థులకు, నిరుద్యోగులకు సరైన న్యాయం చేయడానికే ఇందిరమ్మ రాజ్యం ఉందని సీఎం అన్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 59 వేల నియామక పత్రాలు ఇచ్చింది తామేనని తెలియజేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతీ యువకుల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వానిది పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఆర్థిక చేయూత అందించేందుకు రూ.6000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సెక్టార్లలో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, రాజీవ్ గాంధీ అని.. ఇప్పుడు ఈ ప్రాంతం లక్షలాది ఉద్యోగాల కల్పనకు నెలవైందని భట్టి విక్రమార్క తెలియజేశారు.



Next Story