- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండితెరపై ‘సైనా’ అడుగుపెట్టేది అప్పుడే!
దిశ, సినిమా : బాలీవుడ్ చబ్బీ బ్యూటీ పరిణీతి చోప్రా ఇటీవలే ‘ఏ గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రంతో సక్సెస్ అందుకోవడమే కాక, క్రిటిక్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా అందుకుంది. చాలా కాలం తర్వాత విజయం దక్కడంతో సంతోషంగా ఉన్న పరిణీతి చోప్రా ఈ మేరకు తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ అందించింది. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో ‘పరిణీతి’ లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం పరిణీతి చాలారోజులుగా కష్టపడుతుండగా, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని సందేహాలుండేవి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్.
సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రాన్ని ఇదివరకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పాటు ఐకానిక్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అయిన సైనా బయోపిక్‌ను ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై అందించడమే భావ్యమని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పరిణీతికి అతి తక్కువ వ్యవధిలోనే మూడు బ్యాక్-టు-బ్యాక్ థియేట్రికల్ రిలీజ్‌లకు ఆస్కారం కలిగింది. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో పరిణీతి, అర్జున్ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ‘సందీప్ ఔర్ పింకీ ఫర్రార్’ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఇప్పటికే ఫిబ్రవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ విడుదలైంది. ఇప్పుడు రేసులోకి మూడో చిత్రం వచ్చి చేరింది. కాగా సైనా సినిమాకు అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నాడు.