మలేషియన్ ఓపెన్ వాయిదా

by Shyam |
Saina Nehwal
X

దిశ, స్పోర్ట్స్ : మలేషియన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీని వాయిదా వేస్తూ బీడబ్ల్యూఎఫ్ నిర్ణయం తీసుకున్నది. షెడ్యూల్ ప్రకారం మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మే 11 నుంచి 16 వరకు జరగాల్సిన ఇండియన్ ఓపెన్ రద్దు చేశారు. తాజాగా మలేషియన్ ఓపెన్ కూడా వాయిదా పడటంతో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఒలంపిక్స్‌కు అర్హత సాధించడానికి వారికి ఇండియన్ ఓపెన్ , మలేషియన్ ఓపెన్ , సింగపూర్ ఓపెన్‌లో మాత్రమే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు వాయిదా పడిన ఈ రెండు టోర్నీలు రీషెడ్యూల్ చేసినా టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత టోర్నీలుగా పరిగణించమని బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసింది. ఇక సింగపూర్ ఓపెన్ జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సి ఉన్నది. అది కూడా వాయిదా పడితే వీరి ఒలంపిక్స్ ఆశలు గల్లంతు అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed