సఫారీ టీమ్‌కు ఎదురుదెబ్బ..!

by Shyam |
సఫారీ టీమ్‌కు ఎదురుదెబ్బ..!
X

దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ లైనప్, పేస్ బౌలింగ్ దళాన్ని చూస్తే ప్రత్యర్థి జట్లు కాస్త జాగ్రత్తపడతాయనేది వాస్తవం. కానీ మెగా టోర్నీ్ల్లో కీలక సమయాల్లో ఒత్తిడికి గురై మ్యాచ్‌లు చేజార్చుకుంటారనే అపవాదూ వారిపై ఉండనే ఉంది. ఈ కారణంగానే ‘సఫారీలు పేపర్ పులులే’ అని ప్రతీసారి నిరూపించుకుంటూనే ఉంటారు. ఏ జట్టయినా తమ హోమ్ గ్రౌండ్స్‌లో బాగా ఆడతారు. కానీ దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో కూడా ఓడిపోతుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికాకు జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరుజట్ల మధ్య శనివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుండగా..కీలక పేసర్ రబాడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నడుము దగ్గర గాయం కారణంగా అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో జట్టు నుంచి వైదొలగక తప్పలేదు. ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్‌కే కాకుండా.. ఇండియాతో జరగబోయే సిరీస్‌కి కూడా రబాడా అందుబాటులో ఉండే అవకాశాలు లేవని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్ నాటికి రబాడా కోలుకునే అవకాశం ఉందని..ఆ బోర్డు చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంజ్రా స్పష్టం చేశారు. కాగా, రబాడా స్థానంలో జట్టులోకి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.

Advertisement

Next Story