- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి బృందానికి రోడ్డుప్రమాదం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లి బృందానికి రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారి వద్ద సోమవారం తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. పెంటపాడులో పెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి భద్రాచలం వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు భద్రాచలం మండలం చర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Next Story