రైతు నిరసనలు.. క్రికెట్ దేవుడిపై అంత విద్వేషమా..?

by Anukaran |
రైతు నిరసనలు.. క్రికెట్ దేవుడిపై అంత విద్వేషమా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌కు ఘోర అవమానం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఆయన ఒక ఆరాధ్య దైవం. భారత్‌లో అయితే సచిన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2011లో టీం ఇండియా వరల్డ్ కప్‌ను ముద్దాడిన తర్వాత ఆయన క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ సచిన్ క్రేజ్ ఇంకా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఏ క్రీడాకారుడైన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎండార్స్‌మెంట్స్ తగ్గిపోతాయి. కానీ, సచిన్ ఇప్పటికీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడంటే అక్కడే అర్థమవుతోంది మన మాస్టర్ బ్లాస్టర్ స్టామినా.

అలాంటిది సచిన్ కటౌట్‌పై కొందరు బ్లాక్ ఆయిల్ పోస్తున్న ఫోటోలు, గట్టిగా అరుస్తున్న వీడియాలు శనివారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో సచిన్ అభిమానులు అదే వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో ఆయన గురించి తెలియని వారు చేశారనుకుంటే పొరపాటే. మన దేశంలోని కేరళ రాష్ట్రంలోనే ఆలస్యంగా వెలుగు చూసింది.

అంతకుముందు, కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు రెండు నెలలుగా ఉద్యమిస్తున్న సమయంలో వారికి అంతర్జాతీయ సెలెబ్రిటీల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే. సామాజిక మాద్యమాల్లో భారత్ ప్రతిష్టను కించపరిచేలా పలువురు విదేశీ సెలెబ్రిటీలు కామెంట్స్ చేయడంతో అది విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీనిపై స్పందించిన సచిన్.. ‘‘తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని.. మీ సమస్యలు మీరు చూసుకోవాలని హితవు పలికారు. భారత రాజ్యాంగం కల్పించిన సర్వసత్తాక, సార్వభౌమాధికారాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దేశంలోని సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని, ఈ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని’’ చెబుతూ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ లీడర్లు సచిన్ కటౌట్‌పై నల్లని ఆయిల్ పోస్తున్న ఫోటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, 2014లో టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా సచిన్ ఎవరో తనకు తెలిదంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తుతం ఉటంకిస్తూ.. ఆనాడు మిమ్మల్ని ట్రోల్ చేసినందుకు మేము క్షమాపణలు కోరుతున్నామని ట్విట్టర్‌లో యూత్ కాంగ్రెస్ లీడర్లు చేసిన కామెంట్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దేశమంతా రైతుల పక్షాన నిలిస్తే సచిన్ కేంద్రం పక్షానా మాట్లాడుతున్నారనే కారణంతో వీరు ట్రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, వీరి చర్యలను సచిన్, క్రికెట్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed