- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇమ్యూనిటీ బూస్టర్ ‘సబ్జా’
దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా మళ్లీ తిరగబెడుతోంది. మహమ్మారి నిర్మూలనకు టీకా అందుబాటులోకి వచ్చినా, సాధారణ జనానికి ఇప్పట్లో అందేలా లేదు. ఈ క్రమంలో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఏ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని ఆరా తీస్తున్నారు. అయితే ఇమ్యూనిటీని పెంచడంలో ‘సబ్జా’ గింజలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సబ్జా గింజల్లో ఉండే వైసెనిన్, ఓరింటిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి సాయపడతాయని సూచిస్తున్నారు.
సబ్జాలో ఔషధ గుణాలు మెండు..
‘సబ్జా’ తులసి జాతి మొక్క కాగా, సబ్జా గింజలు(బేసిల్ లీడ్స్) చిన్నగా ఆవాల్లా ఉంటాయి. జిగురులా ఉండే ఈ గింజల్లో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు నీళ్లలో కలుపుకొని తాగితే సమస్య వెంటనే తగ్గిపోయి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా! కేలరీలు ఏ మాత్రం ఉండని ఈ గింజలను రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలలో వేసుకొని తాగితే మలబద్ధక సమస్య ఉండదు.
వ్యాధులు నయం..
శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనెతో పాటు నానబెట్టిన సబ్జా గింజలను కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. బీపీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.
వెయిట్ లాస్..
ఈ గింజల్లో ఉండే ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయాటిక్‌లా కూడా పనిచేస్తాయి.
షుగర్ పేషంట్లకు, క్రీడాకారులకు మేలు..
షుగర్ పేషెంట్లకు సజ్జా ఒక నేచురల్ మెడిసిన్. వారానికి ఒకసారి సబ్జా గింజలతో చేసిన జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ గింజలను తిన్న తర్వాత జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఈ కారణంగా కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియ అదుపులో ఉండి, బాడీలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఇక క్రీడాకారులు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ గింజలను రోజూ తీసుకుంటే శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది.
స్కిన్, హెయిర్ కోసం..
సబ్జా గింజలను తినడంవల్ల కొల్లాజెన్ హర్మోన్ బాగా విడుదలవుతోంది. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందేలోని ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్ చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు జుట్టు బలంగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని బాధపడే వాళ్లు.. సబ్జా గింజలను పొడి చేసి, కొబ్బరి నూనెలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పిల్లలు, గర్భిణులకు వద్దు..
గర్భిణులు, పిల్లలు సబ్జా గింజలను తీసుకోకూడదు. ఎందుకంటే ఈ గింజలు కలిపిన డ్రింక్స్‌ను బాగా కలపకపోతే పిల్లలకు సరిగా ఊపిరి ఆడదు. ఇక గర్భిణుల్లో ఈస్ట్రోజన్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డైట్‌లో సజ్జా గింజలను చేర్చుకునే ముందు ప్రెగ్నెంటా? కాదా? అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే సజ్జా గింజల్ని తీసుకోవద్దు.