బిగ్గెస్ట్ ఆఫర్ కొట్టేసిన థమన్..మెగాస్టార్ మూవీకి మ్యూజిక్

by Jakkula Samataha |   ( Updated:2021-01-20 02:09:14.0  )
బిగ్గెస్ట్ ఆఫర్ కొట్టేసిన థమన్..మెగాస్టార్ మూవీకి మ్యూజిక్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అల వైకుంఠపురంలో’ ఆల్బమ్‌తో వండర్స్ క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే డజనుకు పైగా బిగ్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా..మరో బిగ్గెస్ట్ ఆఫర్ కొట్టేశారు. బిగ్గెస్ట్ డ్రీమ్ అచీవ్ చేశానని తెలుపుతూ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ కోసం సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. ‘లూసిఫర్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు థమన్. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ అందించడం ద్వారా బాస్ మెగాస్టార్ పట్ల ఉన్న ప్రేమను చూపించే అవకాశం వచ్చిందని.. ఒక కంపోజర్‌కు ఇంతకన్నా ఏం కావాలన్నాడు.

ఈ క్రమంలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ డీపీగా మెగాస్టార్ పిక్ సెట్ చేసుకున్నారు థమన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‌’కు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పుడు మెగాస్టార్‌ కోసం కంపోజ్ చేస్తుండడంపై మెగా ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఆఫర్ అయితే కొట్టేశావు కానీ, కాపీ మ్యూజిక్ రాకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నారు.


👉 Read Disha Special stories


Next Story