పండుగ తర్వాతే ఆర్టీసీ చర్చలు :ఎండీ

by Shyam |
పండుగ తర్వాతే ఆర్టీసీ చర్చలు :ఎండీ
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య దసరా పండుగకు ఏ రాష్ట్ర సరిహద్దు వరకు ఆ రాష్ట్ర బస్సులు నడుస్తాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై సునీల్ శర్మ స్పందించారు. తాత్కాలిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేమన్నారు. రెండు రోజులు అలస్యమైనా శాశ్వత ఒప్పందం చేసుకున్న తర్వాతే ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడుస్తాయని తెలిపారు. ఈ నెల 27వ తేదీ తర్వాతే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరగున్నట్లు సునీల్ శర్మ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed